Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

BRS : కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. ఉగాది తర్వాత ప్రకటన..!

BRS : కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. ఉగాది తర్వాత ప్రకటన..!

సికింద్రాబాద్ , మన సాక్షి :

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్లమెంట్ ఎన్నికల తో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దాంతో బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఖరారు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ అభ్యర్థిగా గణేష్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.

 

ఇలా ఉండగా బీఆర్ఎస్ కూడా తన పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. లాస్య నందిత స్థానంలో ఆమె సోదరి లాస్య నివేదిత ను నిలబెట్టేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది.

 

ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, లాస్య నివేదిత కుటుంబ సభ్యులతో కూడా చర్చించినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఉగాది తర్వాత ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ :

BREAKING : గద్దర్ కూతురుకు షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

మరిన్ని వార్తలు