ACB : ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై కేసు.. ఆయన ఫస్ట్ రియాక్షన్..!
ACB : ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై కేసు.. ఆయన ఫస్ట్ రియాక్షన్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏవన్ గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎఫ్ రెడ్డి పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు ఇటీవల గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సిఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తనపై కేసు పెట్టడం వల్ల తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
తాను తప్పు చేయలేదు.. ఎవరికి భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంపై ఆయన పూర్తిస్థాయిలో వివరించారు. అయితే తాను లీగల్ గా వెళ్తానని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, ఏసీబీకి తనపై కేసు పెట్టే అధికారం కూడా లేదన్నారు. ఈ వ్యవహారంలో కేసు పెడితే రేవంత్ రెడ్డి పై పెట్టాలని ఆయన పేర్కొనడం విశేషం.
MOST READ :
-
Gold Price : పసిడి ప్రియులకు అదిరే శుభవార్త.. భారీగా రూ.7100 తగ్గిన బంగారం ధర..!
-
Miryalaguda : మిర్యాలగూడలో ట్రాఫిక్ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూల్స్ పాటించకపోతే కేసులు.. డిఎస్పి వెల్లడి..!
-
PrajaPalana : ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రూ.500 వంటగ్యాస్.. మళ్లీ ప్రజా పాలన దరఖాస్తులకు అవకాశం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!









