Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

CEIR : సిఈఐఆర్ నూతన పోర్టల్ తో పోగొట్టుకున్న ఫోన్లు దొరికాయోచ్…!

CEIR : సిఈఐఆర్ నూతన పోర్టల్ తో పోగొట్టుకున్న ఫోన్లు దొరికాయోచ్…!

4.5 లక్షల విలువగల 23 మొబైల్స్ ను స్వాధీనం

ఎస్ పి రాజేంద్రప్రసాద్

సూర్యాపేట, మనసాక్షి

ఫోన్ లు వాడే వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకున్నట్లు అయితే త్వరితగతిన పట్టుకునే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రికవరీ చేసిన ఫోన్ల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..

 

ఫోన్ పోపోయిన లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సి ఈ ఐ ఆర్ అనే వెబ్ సైట్ లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లైతే అలాంటి మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అన్నారు.

 

ఈ పోర్టల్ నిర్వహణకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ల నందు పోలీసు నోడల్ అధికారులను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరిగినది అన్నారు. ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామని, చాలా మంది వినియోగదారులు వారి పోయిన మొబైల్స్ వివరాలను ఈ రిపోర్టర్ వివరాలను నమోదు చేసుకోవడం జరిగినదని వినియోగదారులు నమోదు చేసుకున్న వివరాల ప్రకారం…

 

పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారులు జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 50 వేల రూపాయల విలువగల 23 మొబైల్స్ ను రికవరీ చేయడం జరిగిందనీ తెలిపారు. వినియోగదారులు ఎవరైనా మొబైల్స్ పోగొట్టుకున్న, వారి మొబైల్ చోరీకి గురైన వెంటనే సంబంధిత వివరాల్లో ఐ ఎం ఈ ఐ మొబైల్ నంబర్, బిల్, మీ సేవా రశీదు, పోలీస్ స్టేషన్, మండలం, జిల్లా, రాష్ట్రం, పిన్ కోడ్ మొదలగు వివరాలతో ఈ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి, ఇలా నమోదు చేయడం వల్ల ఫోన్ ఐ ఎం ఈ ఐ బ్లాక్ చేయబడి ఫోన్ పని చేయదు, ఇందులో ఎవరైనా సిమ్ కార్డ్ వేసుకుంటే ట్రేసబులిటి రిపోర్ట్ వస్తుందని దీని ఆధారంగా పోయిన మొబైల్ లొకేషన్ గుర్తించి స్వాధీనం చేసుకోవచ్చుఅని తెలిపారు.

 

పోయిన సెల్ ఫోన్ లను అశ్రద్ద చేస్తే ఫోన్ లో ఉన్న వ్యక్తి గత ఆధారాలు దొంగిలించి నష్టాన్ని కలగజేస్తాయి, కావున ఇది వ్యక్తి గత భద్రతకు, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని దొంగిలించిన ఫోన్ లతో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నది, కావున ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సి ఈ ఐ ఆర్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇలా చేయడం వల్ల స్వాధీనం చేసుకున్న ఫోన్ ల వివరాలుపోలీస్ స్టేషన్ ల వారిగా ఇలా ఉన్నాయి

పెన్ పహడ్ పోలీస్ స్టేషన్ – 7
సూర్యాపేట 2వ పట్టణ – 3
కోదాడ రూరల్ – 3
సూర్యాపేట రూరల్ – 2
పాలకవీడు – 2
సూర్యాపేట 1వ పట్టణ – 2
కోదాడ టౌన్ – 1
తుంగతుర్తి -1
నూతనకల్ – 1
మోతే – 1

 

ప్రజలు ఎవరైనా మోబైల్స్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సి ఈ ఐ ఆర్ నూతన అప్లికేషన్ లో వివరాలు నమోదు చేసుకోవాలి అని కోరారు.
మొబైల్ ఫోన్ల ను రికవరీ చేసిన పోలీసు అధికారులను, నోడల్ అధికారులను అభినందిస్తున్నాను, బాగా పని చేసిన సిబ్బంది అందరికీ సర్వీస్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా ఎక్కువ మొబైల్స్ రికవరీ చేసిన పెనపహాడ్ ఎస్ ఐ మరియు టీమ్ ను అభినందించి రివార్డ్ అందజేశారు.

 

ఈ కార్యక్రమం నందు డి ఎస్ పి లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి , రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ నర్సింహ, సి ఐ రాజేష్, ఆంజనేయులు, రామలింగారెడ్డి, రాఘవులు, నాగర్జున, ఆర్ ఐ లు శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, నర్సింహారావు, గోవిందరావు, ఎస్ ఐ లు సత్యనారాయణ, హరికృష్ణ, రవీందర్, నోడల్ అధికారులు, మొబైల్స్ బాధితులు ఉన్నారు.

మరిన్ని వార్తలు