మిర్యాలగూడ : చలో నల్గొండ బీఆర్ఎస్ సభకు భారీగా తరలి వెళ్ళిన కార్యకర్తలు..!

చలో నల్లగొండ బహిరంగ సభకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్లారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 65 లారీలు, 70 డీసీఎంలు, 100 కార్లు, 20 ట్రాక్టర్లు, 700 బైక్లతో 10 వేల మందికి పైగా తరలి వెళ్ళారు.

మిర్యాలగూడ : చలో నల్గొండ బీఆర్ఎస్ సభకు భారీగా తరలి వెళ్ళిన కార్యకర్తలు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

చలో నల్లగొండ బహిరంగ సభకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్లారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 65 లారీలు, 70 డీసీఎంలు, 100 కార్లు, 20 ట్రాక్టర్లు, 700 బైక్లతో 10 వేల మందికి పైగా తరలి వెళ్ళారు.

కృష్ణానది జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి భారీ బైక్ ర్యాలీ గా బీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలి వెళ్లారు.

ALSO READ : కెసిఆర్ ఆఖరి అస్త్రం.. నల్లగొండలో సెంటిమెంటు రగిలించే ప్రయత్నమేనా..?

పట్టణంలోని ఎన్ ఎస్ పి క్యాంపు మైదానం నుంచి మొదలైన బైక్ ర్యాలీ ప్రారంభమైంది. బైక్ ర్యాలీ ని మిర్యాలగూడ నియోజకవర్గ సమన్వయకర్త పటాన్ చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు తిప్పన విజయసింహ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉద్యమ నాయకులు అన్నాభీమోజు నాగార్జున చారీ,

యువనేత నల్లమోతు సిద్దార్ధ, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, పట్టిపాటి నవాబ్, కందగట్ల అశోక్, కుప్పాల సుబ్బారావ్, సాదినేని శ్రీనివాస్, ఘంట శ్రవణ్ రెడ్డి, సందేశీ అంజన్ రాజు, తిరుమలగిరి వజ్రం, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : నల్లగొండ : బీఆర్ఎస్ సభకు దీటుగా కేసిఆర్ అన్యాయాలపై ఎల్ఈడి స్క్రీన్ ప్రదర్శన ఎప్పుడంటే..!