సెలవుపై వెళ్లిన చైర్మన్ భార్గవ్, విభేదాలే కారణమా…!
సెలవుపై వెళ్లిన చైర్మన్ భార్గవ్,
విభేదాలే కారణమా…!
మిర్యాలగూడ, మనసాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆయన పదవికి శుక్రవారం సెలవు పెట్టారు. పట్టణ ప్రగతి జరుగుతున్న సమయంలో పదిహేను రోజులపాటు సెలవు పెడుతూ మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్ కు శుక్రవారం లేఖ పంపారు. మున్సిపల్ చైర్మన్ భార్గవ్ సెలవు పెట్టిన విషయం పట్టణంలోచర్చనీయాంశమైంది. ఆయన ఇటీవల నెల రోజుల పాటు అమెరికా ప్రయాణం లో ఉండి.. ప్రయాణం ముగించుకొని వచ్చిన వారం రోజుల లోపే చైర్మన్ పదవికి సెలవు పెట్టడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా వెళ్ళిన సమయంలో సెలవు పెట్టని చైర్మన్ స్థానికంగా ఉండి సెలవు పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న విభేదాలే కారణంగా పలువురు భావిస్తున్నారు.
ఇటీవల తాళ్ల గడ్డ ప్రాంతంలో ఆక్రమిత నివాసాలుగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు కూల్చివేయడం పై భార్గవ్ కు స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు కు విభేదాలు వచ్చినట్లుగా పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం టిఆర్ఎస్ అధిష్టానానికి దృష్టికి కూడా వెళ్ళినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి :
1. నల్గొండ జిల్లాలో ఘోరం, ట్రాక్టర్ రోటో వేటర్ లో ఇరుక్కోని బాలుడు మృతి – latest news
2. బంగ్లాదేశ్ టు భారత్ : నదిలో ఈది.. ప్రియుడు చెంతకు చేరిన మహిళ..!
3. చిన్నతనం నుంచి దొంగతనాలే, అంతర్ జిల్లా బైకుల దొంగ అరెస్టు









