ఆమనగల్ ఫారెస్ట్ రేంజ్ బార్డర్లో చిరుత కళేబరం..!

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని ముజాహిద్పూర్ పెద్ద వెలికిచర్ల మధ్యలో ఆమనగల్ ఫారెస్ట్ రేంజ్ బార్డర్లో శనివారం చిరుత కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

ఆమనగల్ ఫారెస్ట్ రేంజ్ బార్డర్లో చిరుత కళేబరం..!

కుల్కచర్ల, మన సాక్షి:

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని ముజాహిద్పూర్ పెద్ద వెలికిచర్ల మధ్యలో ఆమనగల్ ఫారెస్ట్ రేంజ్ బార్డర్లో శనివారం చిరుత కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత కళేబరం కనిపించిన నేపథ్యంలో ఘటన స్థలంలో ఆడవాళ్లు గుర్తించేందుకు ఫారెస్ట్ రేంజ్ బార్డర్లో పరిశీలించగా చిరుత కళేబరాన్ని గుర్తించడం జరిగింది.

ఆమనగల్ డి ఎఫ్ ఓ వేణుగోపాల్ వారి సిబ్బంది ఆ కళేబరాన్ని పరిశీలించి స్థానిక డాక్టర్లను గెలిపించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముజాహిద్పూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్వప్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు , గ్రామస్తులు మరియు రైతులు చిరుత కళేబరాన్ని పరిశీలన చేయడం జరిగింది.

ALSO READ : TSRTC : ఆర్టీసీకి మోసం కేసులో గో రూరల్ ఇండియా నిర్వాహకుడు అరెస్ట్..!