Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Chinthapally :  శ్రీశ్రీశ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి

ప్రతి ఒక్కరూ శ్రీశ్రీశ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి లు అన్నారు.

Chinthapally :  శ్రీశ్రీశ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి

బిఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్.

చింతపల్లి, మన సాక్షి :

ప్రతి ఒక్కరూ శ్రీశ్రీశ్రీ భవాని రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి లు అన్నారు. బుధవారం చింతపల్లి మండల పరిధిలోని తిదేడు గ్రామంలో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ పాల్గొని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టెశ్వర్యాలతో ఆనందంగా మెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ స్వప్న శేఖర్ రెడ్డి, కోండల్ నాయక్, ప్రణవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బూరుగు రవికుమార్ ,శీమర్ల క్రిష్ణ యాదవ్, మోతిరాం నాయక్, జైపాల్ నాయక్, గడ్డం శేఖర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By : Puppala Venkateshwarlu, Sr.Reporter

 

మరిన్ని వార్తలు