CID Show : సిఐడి షో లో ప్రద్యుమన్ ఇక లేనట్లేనా..!
CID Show : సిఐడి షో లో ప్రద్యుమన్ ఇక లేనట్లేనా..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
సిఐడి షో అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియని వారే లేరు. ఇది క్రైమ్ షోలలో సిఐడి ముందు వరుసలో ఉంది. హిందీలో తీసిన ఈ సీరియల్ మిగతా భాషలలోకి డబ్బింగ్ చేశారు. తెలుగులో సిఐడి షోకు మస్తు క్రేజ్ వచ్చింది. ప్రతి ఎపిసోడ్ ట్విస్టు లతో మతిపోయేలా చేస్తుంది.
1998లో మొదలైన ఈ సిఐడి షో ఇప్పటివరకు కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపు 25 సంవత్సరాలు అవుతున్నా కూడా సిఐడి షోకు ఆ క్రేజ్ ఇంకా తగ్గలేదు. అయితే ఇప్పుడు సీజన్ 2 ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. సీజన్ 1 టాప్ రేటింగ్ లో కొనసాగింది. అయితే ప్రస్తుతం సీజన్ 2 ప్రసారం అవుతుంది.
సిఐడి షో అనగానే అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏసిపి క్యారెక్టర్. ఏసిపి ప్రద్యుమన్ క్యారెక్టర్ లో శివాజీ సతమ్ జీవించాడు. అందుకే ఆ షోకు అంత క్రేజ్ లభించింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఏసీబీ ప్రధ్యుమన్ క్యారెక్టర్ సీజన్ 2 లో గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. కొన్ని ఎపిసోడ్ ల నుంచి కనిపించడం లేదు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అసహనానికి గురవుతున్నారు.
ఇలాంటి టైం లో సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ భారీ ట్విస్ట్ తో పాటు షాక్ కూడా ఇచ్చింది. సిఐడి సీజన్ 2 లో ఏసీబీ ప్రధ్యుమన్ పాత్ర చనిపోయినట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక ఏసీబీ ప్రధ్యుమన్ పాత్ర లేకుంటే సిఐడి 2 సీజన్ రేటింగ్స్ తగ్గే అవకాశం ఉంది.
MOST READ :









