సిగరెట్ దొంగలు
సిగరెట్ దొంగలు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి : షాద్ నగర్ పట్టణంలోని జిహెచ్ఆర్ సమీపంలో గల అశ్విని ట్రేడర్స్ లో శనివారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. ట్రేడర్స్ లో ఉన్న ఒక లక్ష విలువైన వివిధ రకాల సిగరెట్లను దొంగతనం చేశారు. అదే విధంగా కౌంటర్ లో ఉన్న పది వేల రూపాయల నగదు తస్కరించారు.
రాత్రి పొద్దుపోయాక షాప్ బంద్ చేసి వెళ్లిన యజమాని పోలశశి ఉదయం షాపు తెరిచి చూడగా దొంగతనం జరిగినట్లు గ్రహించారు. షాపులోనే పైన రేకులను తొలగించి దొంగలు సునాయాసంగా లోపలికి ప్రవేశించారు. పాత హైవే రోడ్డు పక్కనే ఉన్న అశ్విని ఏజెన్సీస్ లో దొంగతనం జరగడం గమనార్హం. పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఇవి కూడా చదవండి :
1. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ – latest news
3. మద్యం తాగి వివాహ వేదిక మీదికి వరుడు, మరదలు చేసిన పనికి అంతా షాక్ (వీడియో)









