Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లారాజకీయం

సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష – గోలి శ్రీనివాస్ రెడ్డి

సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష – గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ లోకి ఆగని వలసలు

బిఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి , మన సాక్షి

గులాబీ జెండాయే అందరికి అండ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
నారాయణ పూర్ గ్రామం వారి నివాసంలో కల్వకుర్తి మున్సిపల్, జూపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు శివకృష్ణ, మల్లేష్ యాదవ్, అరవింద్, రాము, లక్ష్మికాంత్, జూపల్లి మల్లేష్ ,వంశీ, శివకుమార్, శేఖర్, శ్రీకాంత్,లక్ష్మణ్, రాజ్ కుమార్, దాదాపు 100 మందికి గులాబీ కండువ కప్పి  బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కల్వకుర్తి నియోజకవర్గం తో పాటు రాష్ట్రం లో గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇతర పార్టీల నుంచి ఆగకుండా వలసలు కొనసాగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, కొత్త పాత తేడా లేకుండా అందర్నీ సమానంగా చూసే పార్టీ ఒక్క బిఆర్ఎస్ పార్టీ నే అని అన్నారు.అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని తెరాస పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో అందరూ పని చెయ్యాలని బిఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడొద్దని అందరు పార్టీ కోసం కలిసికట్టుగా పని చెయ్యాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పెద్దపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్, నారాయణ పూర్ సర్పంచ్ అంజి నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్,మాజీ సర్పంచ్ శంకర్ నాయక్,తలకొండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, రూపం వెంకట్ రెడ్డి వడ్డెమోని శివ కుమార్ ,వరికుప్పల రాజశేఖర్,సుమన్ నాయక్, సతీష్, గుజ్జరి గోపి, బన్నే శేఖర్, కళ్యాణ్ నాయక్,మాధరం మహేష్, గణేష్, శివ, శ్రీరాములు, అంజి నాయక్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు