సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం – ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం – ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, మనసాక్షి :
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని మిర్యాలగూడ ఎమ్మెల్యే వెలమూరు భాస్కరరావు అన్నారు గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణము ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నియోజక వర్గ వ్యాప్తంగా 101 మందికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు చెక్కులు అందజేశారు.
(మిర్యాలగూడ టౌన్-42 మందికి 24,81,500, మిర్యాలగూడ మండలం 29 మందికి 12,04,000, దామరచర్ల -12 మందికి 3,85,000, వేములపల్లి 11 మందికి 4,52,000, మాడ్గులపల్లి 07 మందికి 5,30,000) మొత్తం101 మందికి 50 లక్షల 52 వేల 500 రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలంగాణ అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు పంపిణి చేసారు.
కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంతు రెడ్డి, జెడ్ పి టి సి అంగోతు లలిత హాతిరాం నాయక్, అన్నభిమోజు నాగార్జున చారి, కుందూరు వీరకోటి రెడ్డి, అమరావతి సైదులు, బీ ఆర్ ఎస్ పట్టణ పార్టీ కార్యదర్శి పెద్ది శ్రీనివాస గౌడ్, మగ్దూం పాషా, బి.ఆర్.ఎస్ మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి,
గడగోజు ఏడుకొండలు, వేలిశెట్టి రామకృష్ణ, వంగాల నిరంజన్ రెడ్డి, తిరుమలగిరి వజ్రం, పునాటి లక్ష్మీనారాయణ, పశ్యా శ్రీనివాస రెడ్డి, లింగా రెడ్డి, పెద్ద కోటి రెడ్డి, ఆశీర్వాదం, శ్రీహరి, కృపాకర్ రావు, చిర్ర మల్లయ్య యాదవ్, ఖాదర్, నంద్యాల శ్రీరాం రెడ్డి, పాశం నరసింహ రెడ్డి, ఎలకాని సుజాత రమణ, అనిరేడ్డి నాగలక్ష్మి, పెండ్యాల పద్మ,సజ్జల శ్రీనివాస రెడ్డి, చిరుమర్రి రమణయ్య, అంకెపాక రాజు, నాగరాజు, గోటే కనకయ్య, చలికంటి యాదగిరి, జక్క నాగేశ్వర రావు, భోగాల శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.











