సూర్యాపేట : నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

సూర్యాపేట : నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

సూర్యాపేట మే18 మనసాక్షి

సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ భవన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కోరారు. గురువారం మధ్యాహ్నం సూర్యాపేట పట్టణంలోని కుడకుడ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన పనులను కలెక్టర్ తనిఖీ చేశారు.

 

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఇటీవల నూతన కలెక్టరేట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శన చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు, దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ,జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ కలసి పనులను వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

 

నూతన సమీకృత భవన్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో పనులు వేగంగా జరగాలని లేబర్ ,మెటీరియల్ పెంచి పనులు త్వరితగతిన జరగాలని కలెక్టర్ తెలిపారు. జూన్ మొదటివారం కల్లా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించారు .

 

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ సి నరసింహ నాయక్, ఈ ఈ ఎం యాకూబ్ అలీ, డిఈ పవన్ సిబ్బంది పాల్గొన్నారు.