నల్గొండ : జిల్లా కలెక్టర్, ఎస్.పి తనిఖీలు..!

ఎన్నికల నిర్వహణలో చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్, ఎస్.పి.అపూర్వ రావు లు ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళి లో భాగంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్టుల వద్ద సంబంధిత పోలీస్ సర్వెలెన్స్ టీమ్ లు వాహనాలు తనిఖీ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు.

నల్గొండ : జిల్లా కలెక్టర్, ఎస్.పి తనిఖీలు..!

నల్గొండ, మన సాక్షి.
ఎన్నికల నిర్వహణలో చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్, ఎస్.పి.అపూర్వ రావు లు ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళి లో భాగంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్టుల వద్ద సంబంధిత పోలీస్ సర్వెలెన్స్ టీమ్ లు వాహనాలు తనిఖీ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు.

బుధవారం జిల్లాలోని మునుగోడ్ మండల కేంద్రం లో ఏర్పాటుచేసిన చెక్ పోస్టును తనిఖీ చేసి వాహనాల ను పోలీస్ టీమ్ ఏ విధంగా తనిఖీ లు చేస్తున్నారు పరిశీలించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించే సమయంలో వీడియో సర్వేలెన్సు టీం అధికారులు తనిఖీలను వీడియో రికార్డింగ్ చేయాలని, నగదు, మద్యం తదితర ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలు తరలింపు జరగకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి.శ్రీధర్ రెడ్డి, చెక్ పోస్ట్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: 

  1. నల్గొండ : బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. గుత్తా ముఖ్య అనుచరుడు కాంగ్రెసులో చేరిక..!
  2. కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎంఎల్ఏ లు నాతో విడిపోవచ్చు.. అయినా వారి విజయాన్నే కోరుకుంటున్నా..!
  3. రాహుల్ గాంధీ తెలంగాణ బస్సు యాత్రపై కేటీఆర్ సంచలన కామెంట్స్..!