Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : వ్యాధి సోకిన జీవాల మాంసం విక్రయిస్తున్నారని ఫిర్యాదు.. దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరిక..!

Narayanpet : వ్యాధి సోకిన జీవాల మాంసం విక్రయిస్తున్నారని ఫిర్యాదు.. దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరిక..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో ని మటన్ మార్కెట్ లో ఆదివారం మున్సిపల్ కమీషనర్ సునీత ఆదేశానుసారం మున్సిపల్ అధికారులు మాంసం దుకాణాలను తనిఖీ చేశారు.

ఇటీవల మటన్ వ్యాపారస్తులు గాలికుంటు వ్యాధి సోకిన జీవాల మాంసం అమ్ముతున్నారని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదులు అందాయి. మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు తన సిబ్బందితో కలిసి మార్కెట్లో కలియ తిరుగుతూ కలుషిత మాంసాన్ని, అమ్మితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

దుకాణాలు సీజ్ చేస్తామని మటన్ వ్యాపారస్తులకు హెచ్చరించారు. ఈ తనిఖీ లో శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశ్యవులు, వార్డ్ ఆఫీసర్ ఆంజనేయులు జవాన్ నరేష్ లు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు