మైనార్టీలకు అండగా కాంగ్రెస్..!

మైనార్టీలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని సిడబ్ల్యుసి సభ్యులు డాక్టర్ చెల్లా వంశీచంద్ రెడ్డి , ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కి మద్దతుగా ఆమనగల్ పట్టణంలోని మైనార్టీ నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

మైనార్టీలకు అండగా కాంగ్రెస్..!

ఆమనగల్, మన సాక్షి :

మైనార్టీలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని సిడబ్ల్యుసి సభ్యులు డాక్టర్ చెల్లా వంశీచంద్ రెడ్డి , ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కి మద్దతుగా ఆమనగల్ పట్టణంలోని మైనార్టీ నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సమావేశానికి కాంగ్రెస్ మండల అధ్యక్షులు తెల్లమల్ల జగన్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తుందన్నారు. మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించినట్లు వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలన్నీ అమలు చేయనట్లు తెలిపారు.

కార్యక్రమంలో టిపిసిసి కార్యవర్గ సభ్యులు ఆయిల శ్రీనివాస్ గౌడ్, కడ్తల్ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు జాంగిర్ బాబా, మైనార్టీ నాయకులు మహమ్మద్ గౌస్ మైనుద్దీన్, ఎంఏ ఖలీల్, ఖాదర్, ఖాద్రి, మహమ్మద్ జహంగీర్, మహబూబ్అలి, రహీం, కరీం, రఫిక్, షర్ఫుద్దీన్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : టపాకాయల వ్యాపారుల మధ్య వివాదం.. గొడ్డలితో దాడి..!