కాంగ్రెస్ పార్టీలోకి పెద్దగోని రమేష్ గౌడ్ చేరిక
ఇటీవల బీజేపీ పార్టీని వీడిన చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన పెద్ద గోని రమేష్ గౌడ్ ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరా

కాంగ్రెస్ పార్టీలోకి పెద్దగోని రమేష్ గౌడ్ చేరిక
చౌటుప్పల్. మన సాక్షి :
ఇటీవల బీజేపీ పార్టీని వీడిన చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన పెద్ద గోని రమేష్ గౌడ్ ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాదులోని గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మాణిక్ రావు ఠాక్రే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, యువకులు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అనంతరం పెద్దగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.
ALSO READ :
- BLR : బి ఎల్ ఆర్ కు అండగా ఉండాలి – రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య
- అనుమానాస్పద స్థితిలో 6 సంవత్సరాల బాబు మృతి
- Gruhalakshmi : గృహ లక్ష్మీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
- Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని విశ్వసించి,కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవకుడిగా సేవలందిస్తానని అన్నారు.