కాంగ్రెస్ లో చేరింది అందుకే.. అసలు విషయం బయటపెట్టిన షర్మిల..!

ఆంధ్ర ప్రదేశ్ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అందుకు ముందుగా కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆమె తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి శనివారం ఆశీస్సులు అందుకున్నారు

కాంగ్రెస్ లో చేరింది అందుకే.. అసలు విషయం బయటపెట్టిన షర్మిల..!

కడప, మన సాక్షి :

ఆంధ్ర ప్రదేశ్ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆమెకు పిసిసి చీఫ్ గా నియమించిన అనంతరం తొలిసారిగా కడప జిల్లాకు వెళ్లారు. అందుకు ముందుగా కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆమె తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి శనివారం ఆశీస్సులు అందుకున్నారు. ఆదివారం ఆమె పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పిసిసి చీఫ్ గా స్వీకరించబోతున్న నేపద్యంలో తన తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయకు వచ్చినట్లు తెలిపారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేర్చందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన ముందున్న లక్ష్యమని, రాజశేఖర్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని లక్ష్యం ఉండేదని అందుకు లక్ష్యం నెరవేరేవరకు పోరాటం చేస్తానని చెప్పారు.

ALSO READ : కెసిఆర్ ఎన్నడూ దావోస్..గీవోస్ గురించి పట్టించుకోలేదు, మరి రేవంత్ వెళ్తే జోకులు ఎందుకో చూడండి..!

తనను నమ్మి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన పార్టీ హై కమాండ్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. షర్మిల రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధిష్టానం కీలక పదవి అప్పగించింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కడప జిల్లాకు వెళ్లిన షర్మిలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఏపీ రాజకీయాలలో షర్మిల సోదరుడు వైయస్ జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా రాబోయే ఎన్నికల్లో షర్మిల తన అన్న జగన్ తోనే ఢీ కొట్టాల్సి ఉంది. అన్న – చెల్లెల పోరు ఎలా ఉంటుందో వారితో పాటు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రసవత్తరంగా మారనున్నాయి.

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తుల ఆహ్వానం..!