NarayanKhed : కాంగ్రెస్ తోనే పేదల సంక్షేమం..!

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నారాయణఖేడ్ నియోజకవర్గానికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని పార్లమెంట్ ఎన్నికల అనంతరం అభివృద్ధిలో దూసుకు పోతామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి చెప్పారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు కోసం కంగ్టి మండల కేంద్రంతోపాటు తడ్కల్ గ్రామంలో గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

NarayanKhed : కాంగ్రెస్ తోనే పేదల సంక్షేమం..!

– ఎమ్మెల్యే సంజీవరెడ్డి,

కంగ్టి, మన సాక్షి:-

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నారాయణఖేడ్ నియోజకవర్గానికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని పార్లమెంట్ ఎన్నికల అనంతరం అభివృద్ధిలో దూసుకు పోతామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి చెప్పారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు కోసం కంగ్టి మండల కేంద్రంతోపాటు తడ్కల్ గ్రామంలో గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సురేష్ షెట్కార్ ను గెలిపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తద్వారా అభివృద్ధికి భారీగా నిధులు వస్తాయని అన్నారు. తనను ఆశీర్వదించిన తరహాలోనే ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కార్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పదేళ్ల బీఆర్ఎస్, బీజేపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు.

” తడ్కల్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తా”

తడ్కల్ గ్రామంను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. గత పాలకులు మండల చేయడం చేతకాలిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలు తగ్గించిన తడ్కల్ మండలం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మండలం ఏర్పాటు ఒక కమిటీ ఏర్పాటు చేసి పరిశీలించి ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, ఖేడ్ నియోజకవర్గాల ఇంచార్జ్ శశికళ యాదవ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మల్లారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు డాక్టర్ హమీద్, పెద్ద మల్లారెడ్డి, మాజీ ఎంపిటిసి బాలప్ప , బాబు సాబ్,బ్రహ్మానంద రెడ్డి, మనోహర్,కృష్ణారెడ్డి, వీరేశం, సమీర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?