మిర్యాలగూడ : బిఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక..!

మిర్యాలగూడ : బిఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం కేంద్రం భవాని తాపీ మేస్త్రి యూనియన్ సభ్యులు 50 కుటుంబాలు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

యూనియన్ అధ్యక్షులు పిడతల వెంకటరత్నం కోశాధికారి కోట సుందర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి , వేములపల్లి ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య పార్టీ కండువాలను కప్పి స్వాగతం పలికారు.

పార్టీలో చేరిన వారంతా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినామని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు శక్తి వంచన లేకుండా పనిచేస్తామని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దేయంగా నిలుస్తామని అన్నారు.

ALSO READ :