Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Komati Reddy Press Meet : తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటూ.. తెలంగాణ పేరు మార్చుకున్న పార్టీ .. ఆ పార్టీ కథ ముగిసినట్లే..!

Komati Reddy Press Meet : తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటూ.. తెలంగాణ పేరు మార్చుకున్న పార్టీ .. ఆ పార్టీ కథ ముగిసినట్లే..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ పేరును టిఆర్ఎస్ గా ఉంటే పేరు మార్చుకున్న పార్టీ .. ఇకపై ఆ పార్టీ కథ ముగిసిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ పేరును మార్చుకుంటారా..? మార్చుకుంటే తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటూ పేరు మార్చుకోవడం ఎంతవరకు సమంజసం.. పేరు మార్చుకున్న పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్ ను సీఎం కూర్చునించి దించడమే అంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అధికారంలోకి వస్తుందని భీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు . ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 నుంచి 85 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ : Bigg Boss : బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా.. మరోసారి మినీ గ్రాండ్ ఎంట్రీ.. ఎవరెవరు వస్తున్నారంటే..!

ఈసారి కేసీఆర్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదని. ఎంపీ టికెట్ అంశంపై పార్టీ అధిష్టానమే మాట్లాడుకుంటామని, పార్టీలో ఉన్న సమస్యలపై కూడా ఢిల్లీలో మాట్లాడుకుంటామని తెలిపారు . హరీష్ రావు పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ “హరీష్ బి ఆర్ ఎస్ లో ఏం జరుగుతుందో తెలుసుకో” అంటూ మంత్రికి చెప్పారు.

కోట్ల రూపాయల టికెట్లు అమ్ముకోలేదా..? అని ప్రశ్నించారు. అమ్ముకునే పరిస్థితి టిఆర్ఎస్ లోనే ఉందన్నారు . హరీష్ రావుకు దమ్ముంటే తన సవాల్ ని స్వీకరించాలని తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు చేశారు.

ALSO READ : హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!

ఒకవేళ నిరూపించకపోతే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తారా ..?అని సవాల్ చేశారు. టిఆర్ఎస్ పేరు మార్చుకున్నప్పుడే ఆ పార్టీ కథ ముగిసిందని, ఎవరైనా తెలంగాణ పేరును మార్చుకుంటారా..? తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటూ తెలంగాణ పేరు మార్చుకున్నారని , పేరు మార్చుకున్న పార్టీ ఇతర రాష్ట్రాలు ఎందుకు పోటీ చేయడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

ALSO READ : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు