కర్ణాటక : కాంగ్రెస్ కు విజయం చేకూర్చింది తెలుగు తమిళీయులేనా..?.. తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్..!

కర్ణాటక కాంగ్రెస్ కు విజయం చేకూర్చింది తెలుగు తమిళీయులేనా..?.. తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. గతంలో కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ ఎన్నికల్లో బిజెపి కూడా తీవ్రతరంగా ప్రచారం నిర్వహించింది. నరేంద్ర మోడీ సభలలో ర్యాలీలలో పాల్గొన్నారు. అయినా కూడా ప్రజలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.

 

తెలుగు, తమిళీయులేనా ..?

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టింది… పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేసింది తెలుగు ప్రజలు తమిళనాడులే అని చెప్పవచ్చును. ఎక్కువగా తెలుగు ప్రజలు తమిలీయులు ఉన్నచోట కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.

 

తెలుగు ప్రజలు ఎక్కువగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, మదనపల్లె ప్రాంతాలకు చెందిన వారితో పాటు తెలంగాణ ప్రజలు కూడా కర్ణాటకలో సెటిలర్లు ఉన్నారు. వీరంతా ఎక్కువగా కోలార్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకు ఉమ్మడి కోలార్ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలను కైవసం చేసుకుంది.

 

దాంతోపాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్న తెలుగు ప్రజలు తమిలీయులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు చూపడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినట్లు చెప్పుకోవచ్చును. ఆ ప్రభావం ఏపీ, తెలంగాణపై తప్పకుండా ఉంటుందని అభిప్రాయం కూడా రాజకీయవేత్తల్లో ఉంది. కాబోయే ఎన్నికల్లో తెలంగాణ ఏపీలో ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో చూడొచ్చు.