Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నల్లగొండ : కరోనా సమయంలో ఉపాధి దొరుకక.. వీరు ఏం చేశారో చూడండి..!

నల్లగొండ : కరోనా సమయంలో ఉపాధి దొరుకక.. వీరు ఏం చేశారో చూడండి..!

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ముఠా గుట్టు రట్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు.

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు.

నిందితుల నుంచి సుమారు 14 లక్షల 20 వేల రూపాయల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు, ఒక ల్యాప్ టాప్, రెండు సెల్ ఫోన్లు, 3 ఇనుప రాడ్లు స్వాధీనం.

మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు వెల్లడి.

మనసాక్షి, నల్లగొండ బ్యూరో :

తాళం వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా పోలీసులు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన కె. ఇమ్రాన్ ఖాన్ (37), నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఇ. సూర్య (38) లు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు గా పని చేస్తూ చెన్నై లో నివాసముంటున్నారు. వీరు జల్సాలకు అలవాటు పడ్డారు.

కాగా వీరికి వచ్చే అరకొర ఆదాయం సరిపోక వీరిరువురూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇదిలా వుండగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్జీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ముషంపల్లి రోడ్డు లోని న్యూ సాయి నగర్ లో నివాసముంటున్నారు.

అయితే ఇటీవల తన కూతురును వరంగల్ లోని నిట్ లో చేర్పించేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు. వారు తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని దొంగలు ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బెడ్రూం లోని బీరువా తాళం పగులగొట్టి అందులో దాచిన 6 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలతో పాటు 5 వేల రూపాయల నగదును దొంగిలించారు.

ALSO READ : మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!

కాగా చోరికి గురైన ఇంటి యజమాని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా గురువారం నల్లగొండ పట్టణంలోని సిమెంట్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇరువురిని ప్రశ్నించగా వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా నల్లగొండ పట్టణంలోని ముషంపల్లి రోడ్డు లోని న్యూ సాయి నగర్ తో పాటు నార్కట్పల్లి, నకిరేకల్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డట్లు ఇద్దరు పంచ్ ల సమక్షంలో అంగీకరించారు.

ALSO READ : Nalgonda : నల్గొండలో విచిత్ర దొంగలు.. వాళ్లు దోచుకునేవి ఏంటో తెలుసా..!

కాగా వీరి వద్ద నుంచి సుమారు 14 లక్షల 20 వేల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, ఒక ల్యాప్ టాప్, రెండు సెల్ ఫోన్లు, 3 ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. 2020 సంవత్సరంలో కరోనా సమయంలో వీరికి ఉపాధి దొరుకక ఇరువురు కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే చెన్నై లో దొంగతనాలు చేస్తే పోలీసులకు దొరుకుతామని భావించి సూర్య కు పరిచయమున్న ప్రదేశాల్లో దొంగతనాలు చేస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు.

కాగా వీరిరువురి మీద ఇప్పటికే 20 కేసులు నమోదు అయి ఉండడం ఇక్కడ గమనార్హం. అయితే ఈ కేసును నల్లగొండ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, నల్లగొండ వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, సీసీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు జి. విష్ణువర్ధన గిరి, లింగారెడ్డి, పుష్పగిరి కానిస్టేబుళ్లు ఇమ్రాన్, నరేష్ లు ఎంతో చాకచక్యంగా ఛేదించారు. కాగా కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు అభినందించారు.

ALSO READ : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం..!

మరిన్ని వార్తలు