Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లారాజకీయం

రాష్ట్ర విభజన హామీల అమలుకై సిపిఐ ప్రజా పోరు 

రాష్ట్ర విభజన హామీల అమలుకై సిపిఐ ప్రజా పోరు 

బి విజయ సారధి సిపిఐ జిల్లా కార్యదర్శి

(మనసాక్షి , మహబూబాద్ జిల్లా కురవి మండలం)

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన రాష్ట్ర విభజన హామీల అమలుకై ఈనెల 25 నుండి ఏప్రిల్ 5 వరకు కొనసాగే సిపిఐ ప్రజా పోరు పాద యాత్ర జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి పిలుపునిచ్చారు.

కొరివి మండల కేంద్రం నందు సిపిఐ నియోజకవర్గ కార్యాలయంలో బుడమ వెంకన్న అధ్యక్షతన జరిగిన పార్టీ నియోజకవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయ సారధి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన నేటికీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలైన బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ లను ఏర్పాటు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ రాజకీయ దివాలా కోరు విధానానికి నిదర్శనమని అన్నారు.

 

మోడీ ప్రభుత్వం మోయలేని భారాలు వే స్తూ ప్రజా రంగ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడం దేవుడి పేరుతో కుల మత ప్రాంత విద్వేషాలను రెచ్చగొడుతూ మరోపక్క రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలను అస్థిరపరిచే విధానాలను అవలంబిస్తుందని తీవ్రంగా విమర్శించారు.

 

సిపిఐ ప్రజా పోరు పాదయాత్రల ను ను ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు చరమగీతం పాడడానికి తోడ్పడాలని పిలుపు చారు .

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్ ,నెల్లూరు నాగేశ్వరరావు ,కొరవి మండల కార్యదర్శి కరణం రాజన్న, చిన్న గూడూరు మండల కార్యదర్శి గంజి శేషాద్రి రెడ్డి, బుర్ర సమ్మయ్య ,దొంతు స్టాలిన్ ,తురక రమేష్ ,దొంతు రామ్మూర్తి ,బొల్లం ఉప్పలయ్య, నర్సింగ్గం గురవయ్య ,రవి ,దూది కట్ల సారయ్య ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు