సిపిఎం కు రాజీనామా చేసి బి ఎల్ ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్
సిపిఎం కు రాజీనామా చేసి బి ఎల్ ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్
వేములపల్లి , మన సాక్షి :
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్, ప్రస్తుత 9వ వార్డు నెంబర్ జేరిపోతుల ఎల్లమ్మ ఆ పార్టీకి రాజీనామా చేసి సామాజికవేత్త , కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి బిఎల్ఆర్ స్వాగతం పలికారు .
ఈ సందర్భంగా జేరిపోతుల ఎల్లమ్మ మాట్లాడుతూ పేదల కోసం పోరాడవలసిన సిపిఎం పార్టీ పెత్తందారి పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ తో కలిసి పోవడానికి జీర్ణించుకోలేక, పేదలకి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే* సాధ్యమని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు.
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొల్కపట్నం బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వార్డు మెంబర్ పేరెల్లి నాగేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి, ఉప సర్పంచ్ రామదార కరుణాకర్, వార్డ్ మెంబర్ రాచూరి వెంకన్న సీనియర్ నాయకులు భారీ పాండు కొమ్మనబోయిన ఆంజనేయులు, శ్రీకాంత్ , పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.









