Crime News : అన్న పై కత్తిపీటతో తమ్ముడు దాడి.. ఆపై బండరాయి తో మోది హత్య..!

బంధాలకు, బంధుత్వాలకు,తవివ్వకుండా తొడబుట్టిన అన్న అనే కనికరం లేకుండా ఆస్తి కోసం అన్న ను తమ్ముడు చంపిన సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పేరక కొండారం గ్రామంలో చోటు చేసుకుంది.

Crime News : అన్న పై కత్తిపీటతో తమ్ముడు దాడి.. ఆపై బండరాయి తో మోది హత్య..!

శాలిగౌరారం, మనసాక్షి :

బంధాలకు, బంధుత్వాలకు,తవివ్వకుండా తొడబుట్టిన అన్న అనే కనికరం లేకుండా ఆస్తి కోసం అన్న ను తమ్ముడు చంపిన సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పేరక కొండారం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బంధువులు, పోలీస్ లు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
అన్నపై కత్తి పీట తో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్క కొండారం గ్రామంలో సోమవారం జరిగింది.

పెర్క కొండారం గ్రామానికి చెందిన చర్ల పెల్లి రాంబాబు (27) అతని తమ్ముడు చర్లపెల్లి నవీన్ ఇద్దరు మధ్యాహ్నం పూట ఇంట్లో నూతన ఇల్లు నిర్మాణం కోసం గొడవపడి.. మాట మాట పెరిగి క్షణికావేశంలో అన్నపై కత్తిపీటతో దాడి చేశాడు. వెంటనే చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతుండగా పక్కనే ఉన్న బండ రాయితో తలపై మోది హత్య చేసినట్లు తల్లి పద్మ తెలిపారు.

సంఘటన స్థలాన్ని నల్గొండ డీస్పీ శివ రాం రెడ్డి, నకిరేకల్ సి ఐ రాజశేఖర్, శాలిగౌరారం ఎస్ ఐ . ఎం . ఐలయ్య లు సందర్శించి, హత్య జరిగిన ప్రాంతాన్ని పర్శిలించి కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. మరో మూడు రోజులే ఛాన్స్..!