Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. మరో మూడు రోజులే ఛాన్స్..!

తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు కొన్ని నెలల నుండి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ కేవైసీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దాని ద్వారా బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రక్రియ కొనసాగింది.

Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. మరో మూడు రోజులే ఛాన్స్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో

తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు కొన్ని నెలల నుండి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ కేవైసీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దాని ద్వారా బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రక్రియ కొనసాగింది.

కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేవైసీ ప్రక్రియ గడువును పెంచుతూ కొంత సమయం ఇచ్చింది. దాంతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డుదారుల అసలు లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టారు. మొదట్లో జనవరి 31వ తేదీ లోపు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో గడువు తేదీ మరో మూడు రోజులు మాత్రమే ఉన్నందున అధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది.

ALSO READ : Telangana : బతికున్న రైతులను చంపేశారు.. రైతుబంధు, రైతు బీమాలో రెండు కోట్లు స్వాహ..!

మూడు రోజుల్లోనే ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 75.76% మంది మాత్రమే రేషన్ కార్డులకు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా 25 శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదు. దాంతో ఇంకా వేలిముద్రలు ఇచ్చి ఈ కేవైసీ చేయించుకోని వారందరూ కూడా ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా చూడాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ అధికారులకు సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు , హైదరాబాద్ చీఫ్ రేషన్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేవైసీ ప్రక్రియ :

తెలంగాణలో ఈ కేవైసీ ప్రక్రియ కొన్ని నెలలుగా కొనసాగుతుంది. రేషన్ కార్డులలో పేర్లు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు రేషన్ దుకాణానికి వెళ్లి కార్డు నెంబరు చెప్పి వేలిముద్ర ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ రేషన్ కార్డు నెంబర్ ను ఆధార్ తో లింక్ చేస్తుంది. దానివల్ల మీరు ఈకేవైసీ ని పూర్తి చేసినట్లుగా రసీదు కూడా అందుకుంటారు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. రేషన్ దుకాణాలలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

ALSO READ : Gas Cylinders : రూ.500 గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం మెలిక.. అందరికీ కష్టమే..!

ఎక్కడ రేషన్ షాప్ దగ్గరికి వెళ్లిన ఈ కేవైసీ ప్రక్రియను లబ్ధిదారులు పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు అంతా కలిసి కూడా ఒకేసారి వెళ్లకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి.

జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు

ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.