Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివ్యవసాయం

Telangana : బతికున్న రైతులను చంపేశారు.. రైతుబంధు, రైతు బీమాలో రెండు కోట్లు స్వాహ..!

Telangana : బతికున్న రైతులను చంపేశారు.. రైతుబంధు, రైతు బీమాలో రెండు కోట్లు స్వాహ..!

  • పోలీసుల అదుపులో వ్యవసాయ అధికారులు

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కాం మరువక ముందే మరో స్కాం వెలుగు చూసింది. రైతుబంధు రైతు బీమా, రైతు బంధు వ్యవహారంలో రెండు కోట్ల రూపాయలు కొట్టేశారు. వ్యవసాయ అధికారి పాత్ర కీలకంగా ఉంది. దాంతో వ్యవసాయ అధికారులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని వెంకిర్యాల, తంగళ్ళపల్లి ,అగిర్యాల ,చిన్న ఎల్కిచర్ల గ్రామాలకు వ్యవసాయ ఇన్చార్జిగా ఉన్న శ్రీశైలం రైతు బీమా కోసం ఏకంగా 20 మంది బతికున్న రైతులను చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. వారికి సంబంధించిన రైతు బీమా డబ్బులను కాజేశాడు. వారితో పాటు 130 మంది రైతుల రైతుబంధు డబ్బులు పక్కదారి పట్టించాడు.

ALSO READ : Nalgonda : యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి..!

2020 నుంచి సాగుతున్న ఈ కుంభకోణంలో సుమారుగా రెండు కోట్ల రూపాయలు రైతుల సొమ్మును కాజేశారు. మరో రెండు వేల మంది అమాయక రైతుల డేటాను సేకరించినట్లు గుర్తించామని అవినాష్ మహంతి తెలిపారు.

తెలంగాణలో మరణించిన రైతులకు రైతు బీమా పథకం ద్వారా ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10000 రూపాయల చొప్పున చెల్లిస్తున్నది తెలిసిందే. దీనిని అవకాశంగా మలుచుకున్న కొందుర్గు మండల వ్యవసాయ శాఖలోని అధికారులు తమ పరిధిలోని 20 మంది రైతుల వివరాలు సేకరించి వారు మరణించినట్లుగా తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి రైతు బీమా డబ్బులను కాజేశారు. 130 మంది రైతుల రైతుబంధు డబ్బులను కాజేశారు.

రైతు బీమా కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్ఐసి చెల్లిస్తుంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతారు. కాగా ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రైతు బీమా పక్కదారి పట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ రైతు బీమా డబ్బులు కాజేసిన విషయంపై ముంబైలోని ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. రైతుబంధు నిధులు కోటి పక్కదారి పట్టినట్లుగా వెలుగు చూసింది. మొత్తం రెండు కోట్ల రూపాయలు కొట్టేసిన ఈ వ్యవహారంలో శ్రీశైలం తో పాటు ఓదెల వీరస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి.

జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు

ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.

మరిన్ని వార్తలు