Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి..!

Nalgonda : యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి..!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 

నలగొండ, మనసాక్షి:

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ,ప్రణాళిక, ఎనర్జీ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం అయన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు , భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, ఎస్ పి చందన దీప్తి, రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో, సి ఎం డి రిజివి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ముందుగా ట్రాన్స్కో ,జన్కో సీఎండి రిజిబి ఆధ్వర్యంలో జెన్కో అధికారులు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పూర్తి చేయడంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ల సహకారం ఎంతో ఉందని అన్నారు.

థర్మల్ పవర్ స్టేషన్ ను త్వరితగతిన పూర్తి చేయటంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టిందని, నేరుగా థర్మల్ పవర్ స్టేషన్ సందర్శించి పనుల పురోగతిని తెలుసుకొని సాధ్యమైనంత త్వరగా వినియోగం లోకి తీసుకువచ్చేందుకు ప్రాజెక్టును సందర్శించినట్లు ఆయన వెల్లడించారు.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పూర్తికిగాను ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ ,సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విధాన నిర్ణయాల కై అవసరమైతే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని , అంతేకాక అంతర్గత సమన్వయం కోసం పూర్తిస్థాయిలో పనిచేసేలా ఒక అధికారిని ఏర్పాటు చేసుకోవాలని, అదే సమయంలో ప్రజాప్రతినిధుల సహకారాన్ని సైతం తీసుకోవాలని అన్నారు.

ప్రాజెక్టు వ్యయం మరింత పెరగకుండా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని, ఇందుకు బీహెచ్ఈఎల్ అధికారులు సైతం సహకరించాలని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఏవైనా అవసరమైన సామాగ్రి తదితరాలను ఇచ్చేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమీక్ష సందర్భంగా ప్రాజెక్టు వివిధ దశలు, ప్రాజెక్టు వ్యయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ALSO READ : Power plant : యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనుల పట్ల నిర్లక్ష్యం, వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే ఉపేక్షించేది లేదు.. డిప్యూటీ సీఎం బట్టి

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షలో పాల్గొంటూ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు . ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి, జెన్కో డైరెక్టర్ అజయ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, వైటిపి ఎస్ ఎస్ ఈ సమ్మయ్య, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, బీహెచ్ఈఎల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు మంత్రుల బృందం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని హెలిప్యాడ్ చేరుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ,అధికారులు మంత్రుల బృందానికి ఘనంగా స్వాగతం పలికారు.

ALSO READ : Gas Cylinders : రూ.500 గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం మెలిక.. అందరికీ కష్టమే..!

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.

Manasakshi

 

మరిన్ని వార్తలు