నూతన సంవత్సరం రోజున విషాదం.. ఒకరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెం గ్రామ శివారులో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనగా ఒకరు మృతి చెందారు.

నూతన సంవత్సరం రోజున విషాదం.. ఒకరు మృతి

దమ్మపేట రూరల్, మన సాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెం గ్రామ శివారులో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనగా ఒకరు మృతి చెందారు.

మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి దమ్మపేట మండలం అప్పారావుపేట గ్రామానికి చెందిన రేగుల నరసింహారావు(40)గా గుర్తించారు. మృతుడికి భార్య,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ALSO READ : ఇక..అవ్వా తాతలకు నెలకు రూ.3వేలు..!