Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

అవినీతి, దోపిడీ పాలనను ఓడించండి.. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి..!

అవినీతి, దోపిడీ పాలనను ఓడించండి.. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి..!

మద్యానికి, నోటుకు లోబడకుండా ఓటు వేయండి 

సూర్యాపేట , మనసాక్షి

పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నిలువునా పాతి పెట్టి, నాటి ఉద్యమ ఆకాంక్షలను విద్రోహం చేస్తూ నాలుగున్నర కోట్ల ప్రజల కలలను వేల కోట్ల కుంభకోణాలతో కల్వకుంట్ల కుటుంబం తన్నుకు పోయిందని తెలంగాణాకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చిన కల్వకుంట్ల కుటుంబ దోపిడీ అరికట్టాలంటే వచ్చే ఎన్నికల్లో ఓడించాలని జాగో తెలంగాణ కన్వీనర్, రిటైర్డ్ ఐఏ ఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన జాగో తెలంగాణ బస్సు యాత్ర శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్యా, వైద్యం పూర్తిగా నాశనం అయిందని, ఎన్నికల ముందు గందరగోళంగా పరీక్షలు నిర్వహిస్తూ నిరుద్యోగుల కుటుంబాలను అగమ్యగోచరంగా మార్చిందన్నారు.

ALSO READ : కాంగ్రెస్ లో అసమతి రాగం.. మునుగోడు టికెట్ ఆశించి బంగపడిన చల్లమల్ల సెల్ఫీ (వీడియో) వైరల్..!

ప్రాణహిత తుమ్మిడి హెట్టి నుండి కాళేశ్వరనికి మార్చిన కేసీఆర్ ఘోరమైన అవినీతి వల్లే ప్రాజెక్టు కుంగిపోయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లలో చేసిన అవినీతితో కేసీఆర్ కుటుంబం గిన్నిస్ బుక్ రికార్డ్, ప్రపంచ రికార్డులో నమోదైందని ఎద్దేవా చేశారు. పన్ను రూపంలో తెలంగాణ ప్రజల నుండి లక్షల కోట్లు వసూళ్లు చేసి వేలల్లో మాత్రమే తెలంగాణ కు కేంద్రం ఇస్తుందని మండిపడ్డారు.

మేధావులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు ఓటు వేసే ముందు సరైన నాయకుడికి వేసి భవిష్యత్ తరాలకు బంగారు పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు , నైనాల గోవర్ధన్ ,జె వి చలపతి ,మందాది డేవిడ్ కుమార్ ,గంట నాగయ్య ,కె సైదులు , లింగయ్య , పి డి ఎస్ యు నాయకులు పోలేబొయున కిరణ్ ,ఎర్ర ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Congress Party : ఆ 19 స్థానాలే కీలకం.. రేవంత్ రెడ్డికి పరీక్ష.. పోటాపోటీగా అభ్యర్థులు..!

మరిన్ని వార్తలు