రూ. 4.34 కోట్ల అభివృద్ధి పనులు – latest news

రూ. 4.34 కోట్ల అభివృద్ధి పనులు

మాడుగుల పల్లి, మన సాక్షి: మిర్యాలగూడ నియోజకవర్గం మాడ్గులపల్లి మండలంలో 4 కోట్ల 34 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు శంకుస్థాపన చేశారు. మాడుగుల పల్లి మండలంలోని చిరుమర్తి గ్రామం మీదుగా పొరెడ్డి గూడెం, పాములపహాడ్-బీరేల్లిగుడెం వరకు 10 కిలోమీటర్ల మేర BT రోడ్డు (రెన్యువల్) నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.

కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మాడ్గులపల్లీ మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, పాక్స్ చైర్మన్ జేర్రిపోతుల శ్రీరాములు గౌడ్, సీనియర్ నాయకులూ పొనుగోటి చొక్కారావు, సర్పంచ్లు అలుగుబెల్లి గోవింద్ రెడ్డి, మారుతీ వెంకట్ రెడ్డి, పొరెడ్డి కోటిరెడ్డి, శ్రీశైలం, యాదయ్య, కర్ర ఇంద్రారెడ్డి, ఆగా అఫ్జాల్, శ్రీనివాస్ రెడ్డి, యతం నరేందర్ రెడ్డి, ఎం.పీ.టీ.సీ కళింగ రెడ్డి, కూరెళ్ళ వెంకట చారి, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పార్టీ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.