Telangana : దేశానికి దిక్సూచి తెలంగాణ..!
Telangana : దేశానికి దిక్సూచి తెలంగాణ..!
బిఆర్ఎస్ పేదల ప్రభుత్వం
నారాయణఖేడ్ లో గులాబీ జెండా ఎగురవేద్దాం,
బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు
తడ్కల్ మండల కేంద్రంగా ఏర్పాటు
మంత్రి తన్నీరు హరీష్ రావు
కంగ్టి, మన సాక్షి :
తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నూతన తడ్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధ్యాన్యాతనిస్తూ, ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలనే పక్క రాష్ట్రాలు కాపి కొడుతున్నాయని తెలంగాణ దేశానికి రోల్ మాడల్ గా నిలుస్తున్నాదన్నారు.
ALSO READ : ప్రజలను మభ్య పెట్టేలా కాంగ్రెస్ హామీలు
ఎంపల్లి కళ్యాణమండపం రూ.15 లక్షలతో నిర్మించారు. మైనార్టీ షాది ఖానా రూ. 20 లక్షలతో నిర్మించారు. కులం మతం వర్గ అని తేడా లేకుండా అందరి కోసం పనిచేసే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు.
తడ్కల్ కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను సహకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి లకు దక్కిందన్నారు.
బీఆర్ఎస్ లో చేరికలు జోరు :
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో వలసలు జోరుగా కొనసాగుతున్నాయని మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ALSO READ : Modi : తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. !
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంగారం, జడ్పిటిసి కోట లలిత ఆంజనేయులు, ఎంపిపి సంగీత వెంకటరెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ రమేష్, సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ గడ్డపు మనోహర్, ఎంపిటిసి శ్రీకాంత్,కో ఆప్షన్ సభ్యులు అహ్మద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
షాదీఖానా ప్రారంభించిన మంత్రి హరీష్ రావు…!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నూతన మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి, లను స్థానిక మైనారిటీ కమిటీ సభ్యులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా మైనార్టీ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మైనారిటీ సోదరుల కోసం షాదీ ఖానా నిర్మించి ప్రారంభించినందుకు సన్మానించి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ALSO READ : Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !
ఈ కార్యక్రమంలో మైనార్టీ కమిటీ అధ్యక్షులు ఎంఏ డాక్టర్ హామిద్,కమిటీ సభ్యులు భగవాన్ బాబు సాబ్,చాద్ సాబ్,సత్తార్ సాబ్,ముల్తాని బాబు సాబ్,రుస్తుం జలీల్, ఇసాం సబ్,అంకుష్, జలీల్ రుస్తుం,మైనార్టీ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.











