Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లామహబూబ్‌నగర్విద్య

District Collector : వసతి గృహాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..!

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను, మరియు ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

District Collector : వసతి గృహాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..!

వెల్దండ, మన సాక్షి:

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను, మరియు ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఇటీవల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రిన్సిపల్ వద్దంటూ రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ఆ పాఠశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో, విద్యార్థులతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

అనంతరం బ్రహ్మంగారి దేవాలయం వెనకాల ఉన్న ఎస్టీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి వంటశాలలో ఆహార పదార్థాల క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో ఉన్నాయో లేవోనని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం విషయంలో నిబంధనలు పాటించకపోతే శాఖా పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఆర్డిఓ జనార్దన్ రెడ్డి, తహసిల్దార్ కార్తీక్ కుమార్, ఎంపీడీఓ కృష్ణయ్య, ఎంఈఓ చంద్రుడు,సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, పంచాయతీ కార్యదర్శి గిరి గౌడ్, స్వర్ణ రత్నం,వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు