Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ఆ యాప్ ల జోలికి వెళ్తే ఇక ఖాతాలు ఖాళీ..!

Suryapet : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ఆ యాప్ ల జోలికి వెళ్తే ఇక ఖాతాలు ఖాళీ..!

సూర్యాపేట, మనసాక్షి :

ప్రస్తుత సమాజంలో సాంకేతికత బాగా అభివృద్ధి చెందినది, ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ తో కూడిన అత్యాధునిక మొబైల్స్ అందుబాటులో ఉంటున్నాయి, ప్రజల ఆశను, అవసరాలను, అవగాహన లోపాన్ని అవకాశంగా చేసుకుని కొత్త తరహాలో సైబర్ మోసగాళ్ళు ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దోసెచేస్తున్నారనీ అలాంటి వారి పట్ల అప్రమత్తం గా ఉండాలని జిల్లా ఎస్పీ కే నరసింహ ఒక ప్రకటన లో కోరారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రముఖ వ్యక్తుల, ప్రజా ఆదరణ పొందిన వ్యక్తుల యొక్క నకిలీ వీడియోస్ సృష్టించి సైబర్ మోసగాళ్ళు ప్రజలను ఆర్థిక మోసాలకు గురి చేస్తున్నారు అని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా సృష్టించిన నకిలీ వీడియోస్ సోషల్ మీడియాలో అనగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పబ్లిక్ యాప్ ఇలా రకరకాల సోషల్ మీడియా యాప్ ల నందు వైరల్ చేస్తున్నారనీ అన్నారు.

ప్రజా ఆదరణ పొందిన రాజకీయ, సినీ ప్రముఖుల, క్రీడాకారుల, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల, కేంద్ర సర్వీస్ లో ఉన్న ఉద్యోగుల, ప్రముఖ సంస్థల ఛైర్మెన్ ల, సామాజిక సేవలో ఉన్న వ్యక్తుల యొక్క వీడియోలను సృష్టించి మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పతకాలు, మ్యుచువల్ ఫండ్స్, బ్యాంకింగ్ రంగాలు, ఫీక్షుడ్ డిపాజిట్, ఆన్లైన్ ట్రేడింగ్, షేర్స్ కొనడం మొదలగు వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టగా వారం రోజుల్లో అవి రెట్టింపు అవుతాయి,

మంచి లాభం వస్తాయి అని మీరు పెట్టుబడులు పెట్టి లాభాలు పొందండి అని వీడియోలు సృష్టించి నమ్మబాలుకుతున్నారని అలాంటి వారి మోసాలకు గురి కావద్దని చెప్పారు. చాలామంది అమాయక ప్రజలు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టీ ఆర్థికంగా నష్టపోతున్నారు అని తెలిపారు. ఇలాంటి వీడియోలు నుండి ప్రజలు అప్రమత్తంగా ఉంది ఎవరు ఆర్థిక మోసాలకు గురి కావొద్దు అని కోరారు.

MOST READ : 

  1. Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)

  2. Power Cut : నేడు ఆ ప్రాంతంలో విద్యుత్ కోత.. ఉదయం 9 గంటల నుంచే..!

  3. Narayanpet : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. వారిని పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!

  4. Narayanpet : జిల్లా ఎస్పీ హెచ్చరిక.. వారిని పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు..!

మరిన్ని వార్తలు