సూర్యాపేట వాసికి డాక్టరేట్

సూర్యాపేట వాసికి డాక్టరేట్
సూర్యాపేట , ఆగస్టు7, మనసాక్షి: సూర్యాపేట పట్టణం 43వ వార్డు నెహ్రూ నగర్ కు చెందిన భత్తుల రాముకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి “డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్” విభాగంలో డాక్టరేట్ పొందారు ఇటీవల హైదరాబాదులో జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ఛాన్సిలర్ మరియు రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా డాక్టరేట్ను స్వీకరించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ “జీవిత బీమా” కోవిడ్ 19″ విపత్కర పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయం ఎంపికలపై హైదరాబాద్ కేంద్రంగా ఎంపిక చేసుకుని “ఇన్సూరెన్స్ కంపెనీలపై విస్తృత స్థాయి పరిశోధనలకు”గాను ఈ పి హెచ్ డి డిగ్రీని పొందినట్లు తెలిపారు.
తన పిహెచ్ డి పరిశోధనలు “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ “రీజినల్ డైరెక్టర్ ధర్మానాయక్ “పర్యవేక్షణలో జరిగినట్లు తెలిపారు. ఈ డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవీందర్ పరవేక్షణలో జరిగయన్నారు. ఈ కార్యక్రమానికి “సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ” ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రాము కు డాక్టర్రేట్ రావడం పట్ల మున్సిపల్ కో ఆప్షన్ .బత్తుల ఝాన్సీ రమేష్, లతో పాటు వార్డ్ ప్రజలు పలువురు రాము ను అభినందించారు.
ALSO READ :
1. కోదాడలో ఘనంగా ముత్యాలమ్మ పండగ
2. SURYAPET : ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ
3. ఫ్లాష్.. ఫ్లాష్ .. రోడ్డు ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన నవవధువు మృతి