డాక్టర్ అవతారాం ఎత్తిన హెల్త్ అసిస్టెంట్..!

వికారాబాద్ జిల్లా దోమ మండలానికి చెందిన గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ ఏకంగా డాక్టర్ గా అవాతారం ఎత్తడనే చెప్పవచ్చు.

డాక్టర్ అవతారాం ఎత్తిన హెల్త్ అసిస్టెంట్..!

కుల్కచర్ల, మన సాక్షి:

వికారాబాద్ జిల్లా దోమ మండలానికి చెందిన గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ ఏకంగా డాక్టర్ గా అవాతారం ఎత్తడనే చెప్పవచ్చు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం .. కుల్కచర్ల మండల్ వాల్య నాయక్ తండాకు చెందిన మాణిక్య నాయక్ తన ఎడమ చేతి నొపిగా ఉందని కుల్కచెర్ల మండల కేంద్రంలోని హరి క్లినిక్ లో డాక్టర్ ని బుధవారం నాడు సంప్రదిoచగా మందు చేతికి రాసి రెండు ఇంజన్షన్ ఇచ్చి మందులు రాసి ఇచ్చాడు.

మరుసటి రోజు ఉదయం సరికి మొత్తం బొబ్బలు వచ్చి చేతి చాలా నొపిగా ఉందని భార్య సాదుబాయ్ తో కలిసి వైద్యుడు దగ్గరకి వస్తే తనకు ఇలాంటి సంబంధం లేదని, ఈ విషయం ఇంకా ఎక్కడా చెప్పకు అని బెదిరిచాడు. ఇదే విషయానికి సంబంధించి డాక్టర్ శ్రీనివాసరావుని కలిసి వివరణ అడగగా వివరణ ఇవ్వకుండానే హాస్పిటల్ నుండి పారిపోయాడు.

ఒక పక్క ప్రభుత్వం గవర్నమెంట్ డాక్టర్స్ ఇలాంటికి ప్రయివేట్ హాస్పిటల్స్, క్లినిక్స్ నడపవొద్దు అని పూర్తి గైడలైన్స్ ఉన్నప్పటికి అవన్ని బేఖాతరు చేస్తూ ఒక సంవత్సరం నుండి హాస్పిటల్, సొంత మెడికల్ షాప్ నడిపిస్తున్నాడు. కాగా అతనికి పై అధికారుల అండదండలు ఉన్నాయనే చెప్పవచ్చు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి ప్రజల జీవితాలతో వైద్యం పేరుతో మోసం చేస్తున్న డాక్టర్ల పై కఠిన చర్యలు తీసు కోవాలని బాధితులు, గ్రామస్థులు కోరుతున్నారు.

ALSO READ : మేడిగడ్డ కుంగి పోతుంటే.. కేసీఆర్ సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం విడ్డూరం..!