సూర్యాపేట : డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
సూర్యాపేట : డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు
సూర్యాపేట, మనసాక్షి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల గదుల ఇండ్లను అర్హులైన అందరికీ ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో తాసిల్దార్ గారికి మెమోరాండం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పరిసర ప్రాంతాలలో కుసుమ వారి గూడెం దగ్గర ఇందిరమ్మ మూడో విడతలో, కేసారం, గాంధీనగర్ ల రెండు పడకల గదుల ఇల్లు పూర్తయి రెండున్నర సంవత్సరాలవుతుంది.
ఇంతవరకు వాటిని పంచకపోగా ఆ ఏరియాలలో ఆసంగీక కార్యక్రమాలు అడ్డగా మారాయి అలాగే శిధిలావస్థకు చేరుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ సంవత్సరం జనవరిలో లేనివారికి అప్లికేషన్లు తీసుకొని మూడు నెలలు అవుతున్నా వాటి ఊసే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సామగ్ర విచారణ జరిపి ఇండ్లు లేని వారిని అర్హులుగా ప్రకటించి వారికి త్వరగా ఇప్పించాలని ఆయన తాసిల్దార్ని కోరారు.
కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకున్న వారికి కార్డులు పంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నిమ్మల ప్రభాకర్ మైనార్టీ నాయకులు ఎండి పాషా దికొండ రవి వాడపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.









