దుబ్బాకలో కొనసాగుతున్న బంద్..!

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బందు కొనసాగుతుంది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దుండగులు కత్తితో దాడి చేసినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. కాగా ఉదయం నుంచి దుబ్బాకలో బంద్ కొనసాగుతుంది.

దుబ్బాకలో కొనసాగుతున్న బంద్..!

దుబ్బాక , మన సాక్షి :

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బందు కొనసాగుతుంది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దుండగులు కత్తితో దాడి చేసినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. కాగా ఉదయం నుంచి దుబ్బాకలో బంద్ కొనసాగుతుంది.

సోమవారం రాత్రి దుబ్బాకలో బంద్ నిర్వహించనున్నట్లు వాల్ పోస్టర్లు వెలిశాయి. కాగా మంగళవారం ఉదయం నుంచే వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. విద్యాసంస్థలు తెర్చుకోలేదు. కాగా బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దుబ్బాకలో పోలీసులు భారీగా మోహరించారు.

ALSO READ : BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!

బందుకు ఎలా అనుమతిస్తారు : రఘునందన్ రావు

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బంద్ కు ఎలా అనుమతిస్తారని దుబ్బాక బిజెపి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. దాడి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యంగా దుకాణాలు మూయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ALSO READ : BIG BREAKING : కత్తితో దాడి ఘటన లో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీరియస్.. యశోద ఆసుపత్రికి తరలింపు..!