దుబ్బాక : జాబ్ మేళాకు విశేష స్పందన 

దుబ్బాక : జాబ్ మేళాకు విశేష స్పందన 

దుబ్బాక, మనసాక్షి :
దుబ్బాక నియోజకవర్గం లో నిరుద్యోగ యువకులు లేకుండా చివరి వరకు బొట్టు వరకు కెసిఆర్ ప్రభుత్వం పై పోరాటం చేస్తానని, తుపాకుల నిర్వహించిన జాబ్ మేళా సక్సెస్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు.

 

శనివారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలోని కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇట్టి కార్యక్రమంలో 116 కంపెనీలకు పాల్గొని నియోజకవర్గంలోని 1758 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

 

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దుబ్బాక నియోజకవర్గం లో నిరుద్యోగులు ఉండకుండా చూడడమే లక్ష్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జాబ్ మేళాకు 5825 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అందులో1758 మందికి వివిధ కంపెనీలో ఉద్యోగ రిక్రూట్మెంట్ సర్టిఫికెట్ అందజేశారు.

 

యువత యువకులు తన కాళ్ళ మీద తాను బతికే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. తన ఉప ఎన్నికల్లో నా గెలుపుకు ఎలా సహకరించారో వారి బతుకు బాగు కోసం ఏనాటికి ముందుంటానన్నారు. ప్రస్తుతం నియోజకవర్గం లో కోడిగుడ్డుపై పీకలు పీకే వారు మాటలు ఎవరు పట్టించుకోరని విమర్శించారు.

 

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

 

తాను గతంలో 500 రూపాయలతో సిద్దిపేటలోని ఉపాధ్యాయునిగా పనిచేసి నేడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానని… అదే స్ఫూర్తి నేటి యువత కూడా అన్ని రంగాలు ఎదగాలని ఆకాంక్షించారు. జాబ్ మేళాలో ఇక్కడ అవకాశం వస్తే అక్కడ యువకులు ముందడుగు వేయాలనిసూచించారు.

 

నియోజకవర్గం లో నిరుద్యోగాన్ని పారద్రోలాడమే నా ప్రయత్నంగా పనిచేస్తున్నట్లు, దీనికి అందరూ సహకరించాలని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అంబటి బాలేష్ గౌడ్, సుభాష్ రెడ్డి, విభీషణ్ రెడ్డి, సుంకు ప్రవీణ్, వెంకట్, నవీన్, మచ్చ శ్రీనివాస్, మల్లారెడ్డి, తో పాటు పార్టీ కార్యకర్తలు నాయకులుతదితరులు పాల్గొన్నారు.