District Collector : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి దుద్దిళ్ళ శ్రీపాదరావు.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!
District Collector : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి దుద్దిళ్ళ శ్రీపాదరావు.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!
సూర్యాపేట, మనసాక్షి :
ప్రజా సమస్యలపై దుద్దిల్ల శ్రీపాదరావు నిరంతరం పోరాడినారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకల్లో కలెక్టర్ తేజస్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసo నిరంతరం పోరాడుతూ ఉమ్మడి రాష్ట్రం లొ శాసనసభ్యులుగా, శాసనసభ స్పీకర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ముఖ్యంగా 1964 నుంచి 1999 వరకు ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డియం మార్కెటింగ్ శర్మ, డిపిఓ నారాయణ రెడ్డి , ఇడి యస్సి కార్పోరెషన్ శ్రీనివాస నాయక్, యస్ సి అభివృద్ది అదికారి లత, టి ఎన్ జి ఓ సేక్రటరి దున్న శ్యామ్, డిటి సాఘగౌడ్ ,ఎఓ సుదర్శన్ రేడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి వేడుకలు
ఉమ్మది ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలను సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం లో ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పి నాగేశ్వరరావు , ఏ ఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి లు శ్రీపాదరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో ఆర్.ఎస్.ఐ లు సురేష్, రాజశేఖర్, సాయిరాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సీరియస్.. తాగునీటి విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
-
Fraud : నల్గొండ జిల్లాలో భారీ మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 26 లక్షలతో పరార్..!









