సూర్యాపేట : విద్యాసంస్థల బంద్ విజయవంతం

సూర్యాపేట : విద్యాసంస్థల బంద్ విజయవంతం

సూర్యాపేట , మనసాక్షి
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు , ఇంటర్ కళాశాలల బంద్ కు పిలుపు నిచ్చారు . అందులో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ , ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్ వర్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవి కుమార్ పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు న్యాయమైన విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నారు.

 

కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ మరోవైపు ప్రైవేటు, కార్పోరేట్ విద్యా రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని .లక్షల రూపాయల ఫీజులు దోపిడీ ప్రవేటు ,కార్పోరేట్ పాఠశాల లో జరుగుతున్న ఫీజులను దోపిడిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు..

ALSO READ :

1. GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!

2. Railway Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3624 రైల్వే ఉద్యోగాలు..!

3. Railway : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్..!

 

 

 

విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ ఇవ్వాలిసి ఉండగా , 150 రూపాయలు ఉన్న బస్ పాస్ చార్జీలను 400 పెంచడం వల్ల విద్యార్థులకు పెనుబారంగా మారిందని. దీనివల్ల అనేక పేద బడుగు పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని చదువును మధ్యలోనే వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.తక్షణమే విద్యార్థులందరికీ ఉచితంగా బస్ పాసులు ఇచ్చి ప్రతి గ్రామానికి విద్యార్థుల సమయ అనుకూలంగా బస్సులను నడపాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.

 

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి, పాఠ్యపుస్తకాలను ,యూనిఫా లను తక్షణమే అందించాలని మన ఊరు మనబడి కార్యక్రమానికి నిధుల కొరత లేకుండా చూసి తక్షణమే 7వేల కోట్ల రూపాయలను విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అన్నిటికీ మన ఊరు మనబడి కార్యక్రమము వర్తింపజేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసి , పర్యవేక్షణ అధికారులైన డీఈవో, డిప్యూటీ డీఈఓ , ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు.

 

పాఠశాలల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన నియామకాల బడ్జెట్లో సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని గుర్తు చేశారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించాలని. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.

 

ఈ బంద్ కార్యక్రమంలో లో పి డి ఎస్ యు దుదిపాల ప్రవీణ్, మేడిపల్లి ఉపేందర్, జేజిరాల సాయి, పవన్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్ కుమార్, తాళ్ల వినయ్,ఉజ్వల్, తరుణ్, బత్తుల వినయ్, గోపి అజయ్, ఏఐఎస్ఎఫ్ గడ్డం నాగరాజు, నందారపు వేణుకొనపర్తి యశ్వంత్, ఉప్పుల అఖిల్ కాసర్ల వంశీ, నగరికంటి గోపీచంద్
గంగరబోయిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు.