విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బాలాపూర్, మహేశ్వరం: ఆగస్టు, 23, (మన సాక్షి ) ; విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.నూతనంగా మంజూరు చేసిన బాలాపూర్ మండల కేంద్రం మీర్ పేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..మీర్ పేట్ లో జూనియర్ కళాశాల, తుక్కుగూడ లో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.ప్రతి ఒక్కరి జీవితంలో ఇంటర్ కీలకమని,ఇప్పుడే సరైన దిశలో వెళ్లి బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి కోరారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు,భవనం పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని,ఆ తర్వాత అంతా అభివృద్ధి పై దృష్టి పెట్టాలని,ఆ దిశగా సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు.
రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 1000 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు,1150 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు. 75 డిగ్రీ 2 పీజీ,లా కళాశాలలు ఏర్పాటు చేసినట్లు,వీటిలో అడ్మిషన్ల కోసం డిమాండ్ పెరిగిందని,ప్రభుత్వం ఒక విద్యార్థి పై ఒక లక్ష 25 వేలు ఖర్చు చేస్తుందన్నారు.
యూనివర్సిటీలలో అమ్మాయి ల శాతం పెరుగుతుంది..60 నుండి 80 శాతం వరకు ఉన్నత విద్యలో అమ్మాయిల శాతం పెరుగుతుండటం తో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జంట మునిసిపల్ కార్పొరేషన్లలో మరిన్ని ఉన్నత పాఠశాల ల కోసం కృషి చేస్తా అన్నారు. ప్రతి కళాశాల లో ఒక కౌన్సిలర్ ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అన్నారు.
మీర్ పేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలలో 77 మంది చేరగా అందులో 41 మంది అమ్మాయిలు ఉండటం విశేషం
ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్ ,డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి ,ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఒమర్ జలీల్ ,వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు భూపాల్ రెడ్డి, మీర్పేట పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.