లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

సాధారణ ఎన్నికల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం నారాయణపేట లోని శ్రీ దత్త బృందావన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ భవనంలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లపై సాధారణ పరిశీలకుడు బీపీ చౌహాన్ తో కలిసి పరిశీలించారు.

లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష.

నారాయణపేట టౌన్, మనసాక్షి :

సాధారణ ఎన్నికల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం నారాయణపేట లోని శ్రీ దత్త బృందావన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ భవనంలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లపై సాధారణ పరిశీలకుడు బీపీ చౌహాన్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లెక్కింపు కేంద్రంలో ప్రతి రౌండ్ కు సమాచారం అందించేందుకు మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గంకు సంబంధించి 270 పోలింగ్ స్టేషన్లకు లెక్కింపు జరుగుతుందని, ముందుగా 1258 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని వాటిని మూడు టేబుల్స్ ద్వారా లెక్కిస్తారని తెలిపారు.

ALSO READ : Election : ఎల్లారెడ్డి బాద్ షా అతనే..!

ఉదయం 8:30 గంటల కు ఈవీఎం లెక్కింపు 14 టేబుల్ ద్వారా 20 రౌండ్లు జరుగుతుందని తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలో 284 పోలింగ్ స్టేషన్ల లెక్కింపులో ముందుగా 958 పోస్టల్ బ్యాలెట్ లను మూడు టేబుల్ ద్వారా లెక్కిస్తారని తెలిపారు. అనంతరం ఉదయం 8:30 గంటల కు ఈవీఎంలను 14 టేబుల్ ద్వారా 21 రౌండ్లు లెక్కిస్తారని తెలిపారు.

ఈ లెక్కింపులో రాజకీయ పార్టీ సంబంధించిన ఏజెంట్లు పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను సీసీ కెమెరాతో పర్యవేక్షిస్తూ మైక్రో అబ్జర్వర్లు ఉంటారని తెలిపారు. ప్రతి రౌండ్ కు మీడియాకు చేరవేసి సమాచారం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, అశోక్ కుమార్, ఏవో నర్సింగరావు, తాసిల్దార్ రాణా ప్రతాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ ను కంగారు పెట్టిస్తున్నాయా..!