Elections : లోకసభ ఎన్నికల నామినేషన్లు షురూ.. నల్లగొండకు తొలి రోజు 4 నామినేషన్లు..!
Elections : లోకసభ ఎన్నికల నామినేషన్లు షురూ.. నల్లగొండకు తొలి రోజు 4 నామినేషన్లు..!
నల్లగొండ, మన సాక్షి :
లోకసభ ఎన్నికల లో భాగంగా గురువారం మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి 4 అభ్యర్థులు 6 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.
చోల్లేటి ప్రభాకర్ స్వతంత్ర అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున వారి ప్రతిపాదకులు మాధగోని శ్రీనివాస్ గౌడ్, ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సోషలిస్ట్ పార్టీ (ఇండియా) తరఫున రచ్చ సుభద్రా రెడ్డి ఒక సెట్ నామినేషన్ ను, ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు 2 సెట్ల నామినేషన్ ను దాఖలు చేసినట్లు ఆమె తెలిపారు.
ALSO READ :
Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!
Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!









