Eleshwaram : మార్మోగిన శివనామస్మరణ.. ఏలేశ్వరం గట్టుకు పోటెత్తిన భక్తులు..!

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాగార్జునసాగర్‌ పరిధిలో కృష్ణానదీ జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు భక్తులు పోటెత్తారు.

Eleshwaram : మార్మోగిన శివనామస్మరణ.. ఏలేశ్వరం గట్టుకు పోటెత్తిన భక్తులు..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్‌ జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు పర్యాటక శాఖ శుక్రవారం ఉదయం 6 గంటల ప్రత్యేక లాంచీలు శివుడు కొలువైన ద్వీపం ఏలేశ్వరం కొండకు లాంచీలు నడిపారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాగార్జునసాగర్‌ పరిధిలో కృష్ణానదీ జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే ఏలేశ్వరం గట్టుకు లాంచీలు నడుపుతారు.

శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాగార్జునసాగర్‌ పరిధిలో కృష్ణానదీ జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే ఏలేశ్వరం గట్టుకు లాంచీలు నడుపుతారు. దీంతో  తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ఏలేశ్వరం గట్టుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం లాంచీ స్టేషన్‌ వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాగర్‌ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో లాంచీ స్టేషన్‌ వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. లాంచీ స్టేషన్‌ వద్ద సాగర్‌ పోలీసులు, ఏలేశ్వరం గట్టు వద్ద దేవరకొండ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతాచర్యలు చేపట్టారు.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!