ప్రతి ఇంటికి అయోధ్య రాముని అక్షింతలు..!

వందల సంవత్సరాల పోరాటాలతో అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో భవ్యమైన మందిరం నిర్మాణ లక్ష్యం నెరవేరుతుందని శంకర్‌పల్లి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అన్నారు.

ప్రతి ఇంటికి అయోధ్య రాముని అక్షింతలు..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

వందల సంవత్సరాల పోరాటాలతో అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో భవ్యమైన మందిరం నిర్మాణ లక్ష్యం నెరవేరుతుందని శంకర్‌పల్లి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అన్నారు. సోమవారం మునిసిపల్ పరిధిలోని పలు వార్డులలో ర్యాలీ నిర్వహించి అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీరామ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య శ్రీ రామక్షేత్ర ట్రస్ట్ అక్షింతలను అయోధ్య నుండి ప్రతి పట్టణానికి పంపిణీ చేసిందన్నారు.

ALSO READ : అన్ని వర్గాల వారికి సంక్షేమ సంఘం అండగా నిలవాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ఈ అక్షింతలు పట్టణంలోని రామ భక్తులకు అందజేశారు. జనవరి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి చేరవేయాలన్నారు. శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠా ఐన తర్వాత అక్షింతలు తలపై వేసుకోవాలన్నారు. శుభ కార్యాలకు వినియోగించుకోవాలన్నారు. అనంతరం కరసేవకులు వారి అనుభవాలను తెలిపారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ALSO READ : రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్.. కేవైసీ గడవు పెంచిన ప్రభుత్వం..!