Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటు..!

Miryalaguda : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటుని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా నెహ్రూ తర్వాత వరుసగా 10 ఏళ్లు ప్రధానిగా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ అన్నారు.1990 లో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుపోతున్న సమయంలో ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

నిజానికి ఆనాడు వారు చేసిన సంస్కరణలే నేటి దేశ ఆర్థిక పురోగతికి పునాదులు అని అన్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీనర్గాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యత్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిన ఘనత వారిద్దన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కూడా వారు ప్రధానిగా ఉన్నప్పుడు వారి నేతృత్వంలో తీసుకున్న నిర్ణయమే అని అన్నారు. ఇలాంటి మహనీయుడి కీర్తిని రానున్న తరాలకు తెలియజేస్తూ వారి ఆశయ సాధనలో మనం అందరం నడుచుకోవాలని సూచించారు. ఇలాంటి మహనీయుడిని, ఆర్థికవేత్త నీ కోల్పోవడం మన దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలాబ్ నాయక్, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, చిరుమర్తి కృష్ణయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలి శ్రీనివాస్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు