పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంపు..!

జిల్లాలో 18 సంవత్సరాలు నిండి అర్హట్స్ ఉన్నవారు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్సూచించారు.

పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంపు..!

అర్హులు ఓటు నమోదు చేసుకోవాలి.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.

సూర్యాపేట, మనసాక్షి :

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎం.ఎల్.సి ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు వచ్చే మార్చి 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. బుధవారం ఎం.ఎల్.సి. ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు ఎస్.పి నాగేశ్వరరావు తో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లాలో అర్హులైన పట్టభద్రులు ఇంకా మిగిలి ఉన్న వారు మార్చి 14 వరకు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. అదేవిదంగా ఇప్పటివరకు జిల్లాలోని డివిజన్ల వారీగా ఇప్పటివరకు సూర్యాపేటలో 24039, కోదాడ 11167, హుజూర్ నగర్ 12085 మొత్తం 47291 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. సూర్యాపేటలో 31 కేంద్రాలు, కోదాడ 22, హుజూర్ నగర్ 18 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ALSO READ : ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ గా ఏర్పాట్లు.. రెవిన్యూ డివిజనల్ అధికారి హరిప్రసాద్..!

జిల్లాలో 18 సంవత్సరాలు నిండి అర్హట్స్ ఉన్నవారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 24 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురింప బడునని తెలిపారు. ఎం.ఎల్.సి. ఎన్నికల లో పోటీ అభ్యర్థులు ఖర్చు చేసే ధరల పట్టిక (రేట్ కార్డు) పై ఈ సందర్బంగా ఏమైనా సందేశాలు, సూచనలు ఉంటే పార్టీల ప్రతినిధులు అందించాలని అన్నారు.

అదేవిదంగా ప్రతి మూడు నెలలకు ఒక్కసారి స్పెషల్ సమ్మరి నిర్వహిస్తాని తెలిపారు. పోలింగ్ కేంద్రాల మార్పు పై పార్టీల నాయకులు చర్చించారు. తదుపరి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సబందించి వివిధ అంశాల్లో ఎన్నికల నిర్వహణ సిబ్బందికి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు దాదాపు 50 పైగా శిక్షణాలు ఇచ్చామని అలాగే నిర్దేశించిన సమయం నాటికి మరికొన్ని శిక్షణాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

ALSO READ : ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మహిళ ఉద్యోగిని.. ఇంట్లో కట్టల కొద్ది నోట్లు, కిలోల కొద్ది బంగారం..!

జిల్లాలో వివిధ పార్టీల అధ్యక్షులతో పరిచయ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలుబడిన వెంటనే మోడల్ కోడ్ ఆప్ కాండక్ట్ అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ సమావేశలో కాంగ్రెస్ పార్టీ నుండి చకిలం రాజేశ్వరరావు, బి.ఆర్.ఎస్. నుండి కరుణాకర్, బి.జే.పి. అబిడ్, సి.పి.ఎం. కోటా గోపి, బి.ఎస్.పి. స్టాలిన్, వై.ఎస్.ఆర్. నుండి డి. రమేష్ , ఎన్నికల డి.టి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : నేడు మేడారం మహా జాతర తొలిఘట్టం.. ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ ప్రారంభం..!