ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ గా ఏర్పాట్లు.. రెవిన్యూ డివిజనల్ అధికారి హరిప్రసాద్..!

రాబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరగడానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మదనపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారి హరిప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ గా ఏర్పాట్లు.. రెవిన్యూ డివిజనల్ అధికారి హరిప్రసాద్..!

రామసముద్రం, మన సాక్షి :

రాబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరగడానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మదనపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారి హరిప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం రామసముద్రం మండలానికి విచ్చేసిన ఆయన మండల కేంద్రంలో ని ఎంపిడివో కార్యాలయంలో స్థానిక ఎంపిడిఓ , తహశీల్దార్, ఎస్సై తో పాటు బూత్ లెవల్ అధికారులతో ఎన్నికలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజున ఏ ఆటంకాలు జరుగకుండా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వి నియోగించుకొనేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులను ఆదేశించారు.అలాగే సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పోలింగ్ రోజున అల్లర్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపారు.

బి ఎల్ ఓ లు తమ పరిధిలోని ఓటరు జాబితాను పరిశీలించి అర్హులను జాబితాలో ఉంచి అనర్హులను జాబితాలోనుంచి తొలగించాలని ఆదేశించారు. ఇందులో అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఉండాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న 245,46 పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ పరిశీలించారు.

MOST READ :