BREAKING : యువతిని వేధించిన యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష..!

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 21: (మన సాక్షి): యువతిని వేధించిన యువకుడికి మూడు ఏళ్ల జైలు శిక్ష చేవెళ్ల కోర్టు విధించిందని శంకర్‌పల్లి సిఐ వినాయక రెడ్డి తెలిపారు.

BREAKING : యువతిని వేధించిన యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష..!

జైలు శిక్ష విధించిన చేవెళ్ల కోర్టు

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 21: (మన సాక్షి): యువతిని వేధించిన యువకుడికి మూడు ఏళ్ల జైలు శిక్ష చేవెళ్ల కోర్టు విధించిందని శంకర్‌పల్లి సిఐ వినాయక రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన గున్నాల శ్రీరామ్ రెడ్డి (25) ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు.

శంకర్‌పల్లి పట్టణానికి చెందిన ఓ యువతిని 2019 వ సంవత్సరంలో వేధించాడు. ఆ యువకుడి పై అప్పట్లో కేసు నమోదు కాగా బుధవారం చేవెళ్ల కోర్టు ముద్దాయికి మూడు సంవత్సరాల జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా విధించింది. కోర్టులో యువకుడిపై సాక్షాధారాలు సమర్పించి శిక్షపడేలా చేసిన ఎస్సై లక్ష్మీనారాయణ, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ లను రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్, నార్సింగి ఏసిపి వెంకటరమణ గౌడ్ అభినందించారు.

ALSO READ : చెరువుమాధారం చెరువు కట్ట పై ఉద్రిక్తత…! చేపల టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు..!